టాలీవుడ్ సెన్సేషనల్ హీరో ప్రభాస్.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా హాటెస్ట్ ఎలిమెంట్ ! బాహుబలితో జాతీయ స్థాయి గుర్తింపు పొంది.. ఉత్తరాది ఇండస్ట్రీని కూడా ఏలిపారేసేంత సత్తాను చాటుకుంటున్నాడు. ఇప్పుడు సెట్స్ మీదున్న ప్రభాస్ ‘సాహో’ మూవీ మీద టాలీవుడ్‌లో కంటే.. బాలీవుడ్‌లోనే అంచనాలు అధికంగా వున్నాయి. ఇదిలా ఉంటే.. ఫిల్మ్‌ఫేర్ మిడిలీస్ట్‌కిచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ కొన్ని కొత్త విషయాల్ని చెప్పాడు. నీకిష్టమైన హీరోయిన్ల గురించి చెప్పమంటే.. దీపికా, కత్రినా, అలియా అంటూ టకటకా మూడు పేర్లు చెప్పి షాక్ ఇచ్చేశాడు. బాహుబలి మూవీలో దేవసేనగా ప్రభాస్‌తో కెమిస్ట్రీని షేర్ చేసుకున్న అనుష్క మేటర్ వేరే వుంది.
ఇవన్నీ కాకుండా.. ఇప్పుడు ‘సాహో’ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్న శ్రద్ధా కపూర్ మీద బరువైన కాంప్లిమెంట్లు కురిపించాడు ప్రభాస్. తనకొచ్చిన హిందీ కంటే.. శ్రద్ధా నేర్చుకున్న తెలుగు చాలా గొప్పదన్నాడు. సాహో.. మల్టిలింగువల్ కావడంతో ఆ సినిమా షూటింగ్‌లో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన అనుభవాల్ని ప్రభాస్ బైటపెట్టాడు. హిందీ వెర్షన్ కోసం తీసే సీన్లో తాను భాషాపరమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. తెలుగు సీన్ల విషయంలో శ్రద్ధా కపూర్ అలవోకగా ముగిస్తోందన్నాడు. ఇదిలా ఉంటే.. సాహో తర్వాతి ప్రాజెక్టుల్లోనైనా ప్రభాస్ తనకిష్టమైన ఆ ముగ్గురు భామల్ని రిఫర్ చేస్తాడేమో చూడాలి!
ప్రభాస్ బాగా నచ్చిన ముగ్గురు
Reviewed by Unknown
on
June 22, 2018
Rating:
No comments: